అనకాపల్లి గాంధీనగరం రామాలయంలో శ్రీ విశ్వావసునామ సంవత్సర దిన పంచాంగం అనకాపల్లి విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు డిడి నాయుడు, జిల్లా బిజెపి అధ్యక్షుడు ద్వార పురెడ్డి పరమేశ్వర రావు, ప్రాంత సత్సంగ్ ప్రముఖు శ్రీకాళహస్తి, డాక్టర్ దక్షిణామూర్తి , ఆర్ఎస్ఎస్ నగర సంఘ చాలకు విల్లూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.