కోటవురట్ల బాణాసంచా ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోంమంత్రి అనితతో పవన్ కళ్యామ్ ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాద వివరాలు, క్షతగాత్రుల పరిస్థితిపై పవన్ ఆరా తీశారు. మరోపక్క ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 8కి చేరింది. ఐదుగురు స్పాట్ లోనే చనిపోగా, మరో ముగ్గురు చికిత్స పొందుతూ మరణించారు. గాయపడిన వారికి కేజీహెచ్ లో చికిత్స అందిస్తున్నారు.