అహ్మదాబాద్లో చోటు చేసుకున్న విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ సీఎం రమేష్ తెలిపారు. గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు. 242 మందితో లండన్ బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోవడం అనే వార్త ఎంతగానో ఆవేదనకు గురిచేసిందని విచారం వ్యక్తం చేశారు. విమానం వైద్య కళాశాల వసతి భవనాలపై కూలడంతో మహా ప్రమాదం జరిగిందన్నారు.