అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 8మంది మృతిచెందగా.. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంపై పీఎం మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని కోరారు. పీఎం సహాయనిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల సాయం, గాయపడ్డవారికి రూ. 50 వేల పరిహారాన్ని ప్రకటించారు.