ప్రధాని మోడీ నాయకత్వంలో గల కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై కార్యకర్తలు విస్తృత ప్రచారం చేయాలని అనకాపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. అలాగే పార్టీ అభివృద్ధిపై కూడా దృష్టి సారించాలన్నారు. శనివారం అనకాపల్లి అసెంబ్లీ కన్వీనర్ బొడ్డెడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గం క్రియాశీలక సభ్యుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.