పార్లమెంట్, అసెంబ్లీ, చట్టసభల్లో ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్ ఉన్నాయో అదే విధంగా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం, రాష్ట్ర అధ్యక్షుల డాక్టర్ లాకా వెంగళ రావు డిమాండ్ చేశారు. అనకాపల్లి విజయ రెసిడెన్సి లో జరిగిన సంఘం జిల్లా స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని మంగళవారం డిమాండ్ చేశారు.