రవాణా రంగంలో పనిచేసే డ్రైవర్లు, కార్మికులు సమస్యలు పరిష్కారానికి జనవరి 5న అనకాపల్లిలో జరిగే జిల్లా సదస్సును విజయవంతం చేయాలని యలమంచిలి మండల సిఐటియు కార్యదర్శి చింతకాయల శివాజీ పిలుపునిచ్చారు. సోమవారం యలమంచిలి దిమిలి ఆటో స్టాండ్ వద్ద సదస్సు సంబంధించిన కరపత్రాన్ని అయన రోడ్డు ట్రాన్స్ పోర్ట్ యూనియన్ ఎలమంచిలి మండల కన్వీనర్ ఎమ్. శ్రీనివాస్, సీఐటీయు నాయకులు గంగాధర్ తో కలిసి ఆవిష్కరించారు.