సంక్రాంతి పండుగ సందర్భంగా అసాంఘిక కార్యకలాపాలు పూర్తిగా నిషేధ్దమని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సమయంలో కోడిపందేలు, పేకాట, ఇతర జూదక్రీడల నిర్వహణపై కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల జీవితాలకు, సమాజ శాంతికి భంగం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కోడిపందేలు, పేకాట నిర్వహణ పూర్తిగా చట్టవిరుద్ధమన్నారు.