బౌలువాడ: మంటల్లో చిక్కుకుని దగ్ధమైన బస్సు

78చూసినవారు
బౌలువాడ: మంటల్లో చిక్కుకుని దగ్ధమైన బస్సు
అనకాపల్లి జిల్లా బౌలువాడ దగ్గర బస్సులో బుధవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. డీజిల్ ట్యాంకర్‌ నుంచి మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ప్రమాదం నుంచి డ్రైవర్, క్లీనర్ తృటిలో తప్పించుకున్నారు. ప్రమాదంలో ప్రాణ నష్టం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే బస్సు మాత్రం మంటల్లో చిక్కుకుని దగ్ధమైనట్లు స్థానికులు వివరించారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్