సిపిఐ అనకాపల్లి జిల్లా రెండవ మహాసభలు మే 5, 6, 7 తేదీల్లో జరగనున్నాయని, అవి విజయవంతం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ పిలుపునిచ్చారు. మంగళవారం యలమంచిలిలో సమావేశం నిర్వహించి కరపత్రాలు విడుదల చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ సమసమాజ స్థాపన ధ్యేయంగా 1925లో కాన్పూర్లో ఏర్పడిందని, స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిందని ఆయన వివరించారు.