అనకాపల్లి శ్రీ నూకంబిక అమ్మవారిని చలనచిత్ర దర్శకులు రామ్ గొదల శుక్రవారం దర్శించుకున్నారు. సుహస్ హీరో గా, మాళవిక మనోజ్ హీరోయినగా తేరాకెక్కించిన ఓ బామ అయ్యో రామ చిత్రం జూన్ నెలలో విడుదలవుతున్న సందర్భంలో అనకాపల్లి విచ్చేసి ముందుగా అమ్మవారి దర్శించుకొని మొక్కు చెల్లించుకొని పూజలు నిర్వహించుకున్నారు. ఆలయ నిర్వాహకులు తీర్థ ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖచిత్రం మూవీ డైరెక్టర్ గంగాధర్ పాల్గొన్నారు.