డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పధకంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా గురువారం నుండి అన్ని ప్రభుత్వ స్కూల్స్, కాలేజిల్లో ఇంటర్మీడియట్ చదివే విద్యార్ధులకు ఎస్సీ, ఎస్టీ, బి సి, సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులకు మరింత నాణ్యతగా భోజనం అందించేందుకు చర్యలు చేపట్టినట్టు జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ గురువారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నాణ్యమైన సన్న బియ్యం 25 కేజీల సంచుల్లో పంపిణి చేయడం జరిగిందన్నారు.