అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్ఇజడ్ లో మైతాన్, ఎల్వాయిస్ లిమిటెడ్ కంపెనీలలో సత్యసాయి ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కసిరెడ్డి అప్పలనాయుడు, జిల్లా బ్లడ్ కోఆర్డినేటర్ పైలా గోపి, ఆది బాబు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ హాస్పిటల్ లో పేద పేషంట్లకి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఈ రక్తం అందజేయడం జరుగుతుందని చెప్తూ రక్తదాతలను అభినందించారు.