అనకాపల్లి జిల్లా సబ్బవరం వాసవి రూరల్ క్లబ్ ఆధ్వర్యంలో వి సి ఐ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా గవర్నర్ అధికారిక పర్యటన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా గవర్నర్ కొల్లూరు పార్వతి హాజరై క్లబ్ అందిస్తున్న సేవలు కొనియాడుతూ అభినందిస్తూ అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ ప్రవేశపెట్టిన కొత్త స్కీములన్ని క్లబ్ సభ్యులకు వివరించారు. అలాగే మెంబర్ షిప్ గ్రోత్ కూడా పెంచాలన్నారు.