మంగళవారం ఉదయం రావికమతంలో భారీ వర్షం కురిసింది. గత రెండు రోజులుగా ఎండలతో ఇబ్బంది పడిన ప్రజలకు ఈ వర్షం రిలీఫ్ ఇచ్చింది. ఖరీఫ్ సీజన్‌లో రైతులు సాగు పనులు ప్రారంభించేందుకు ఇది అనుకూలంగా ఉంది. మరో రెండు రోజుల పాటు ఇలాగే వర్షాలు పడితే వరి నారుమడులు సిద్ధం చేసి విత్తనాలు వేసే అవకాశం ఉంటుందని రైతులు పేర్కొన్నారు.