కసింకోట; సోమవారం పల్లె పిలుస్తుంది కార్యక్రమం

69చూసినవారు
కసింకోట; సోమవారం పల్లె పిలుస్తుంది కార్యక్రమం
అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో పల్లె పిలుస్తుంది కార్యక్రమం బుధవారం కసింకోట మండలం సోమవారం గ్రామంలోనిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు తో కలసి ఎమ్మెల్యే రామకృష్ణ గ్రామ సభలో పాల్గొని గ్రామంలో మొక్కలు నాటారు. విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంవత్సరంలో మంజూరు చేసిన విద్యా మిత్ర కిట్ విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ గ్రామాన్ని ఎమ్మెల్యే దత్తత తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్