

ఉగ్రవాదుల చివరి క్షణాలు.. డ్రోన్ ఫుటేజీ (VIDEO)
జమ్మూకశ్మీర్‌లో జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యే ముందు దాక్కుంటున్న దృశ్యం డ్రోన్ ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపించింది. త్రాల్ ప్రాంతంలో జరిగిన ఈ ఘర్షణలో నిర్మాణంలో ఉన్న భవనపు తలంలో తుపాకులతో వారు మోహరించగా భద్రతా బలగాలు వారిని ముట్టడి చేశాయి. అనంతర కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ డ్రోన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.