అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో బుధవారం నిర్వహించిన సదరం క్యాంపు పట్ల స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వసతులు, ఇతర శాఖలతో సమన్వయం లేకుండా జిల్లా వ్యాప్తంగా క్యాంపు ఎలా నిర్వహిస్తారని మండి పడ్డారు. తక్షణమే జిల్లా కలెక్టర్ తో మాట్లాడి మండలాల వారీగా క్యాంపు నిర్వహణకు చర్యలు తీసుకోవాలని కోరారు. అందరి సమన్వయంతో రోజుకి మూడు మండలాలు చొప్పున క్యాంపు నిర్వహించాలని కొనతాల కోరారు.