బుచ్చయ్యపేట మండలం వడ్డాది అక్షర స్కూల్లో ఆదివారం నవోదయ నమూనా పరీక్ష నిర్వహిస్తున్నట్లు స్కూల్ కరస్పాండెంట్ టి. వరప్రసాద్ శనివారం తెలిపారు. నవోదయలో ఆరవ తరగతి ప్రవేశ పరీక్షలకు అవగాహన కల్పించేందుకు విద్యార్థులకు ప్రతి ఏటా తాము మోడల్ టెస్టులు నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి గల విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోవాలని వివరాలకు 9966332414 సంప్రదించాలని మొదటి రెండు స్థానాలలో నిలిచిన వారికీ నగదు పురస్కారం అందిస్తామన్నారు.