అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్ లో నిర్వహించే వినాయక చవితి ఉత్సవాల వాల్ పోస్టర్ ను టిడిపి బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ మల్ల సురేంద్ర గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐకాన్ యూత్ సభ్యులు మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి అలంకరణలో 35 అడుగుల వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్లు తెలిపారు. చవితి ఉత్సవాలను ఏడవ తేదీన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రారంభిస్తారని అన్నారు.