పూడిమడకలో రాష్ట్రస్థాయి బీచ్ హ్యాండ్ బాల్ బాలురు పోటీలను జనసేన పార్టీ ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవహారాల ముఖ్యప్రతినిధి సుందరపు సతీష్ కుమార్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు క్రమశిక్షణతో శిక్షణ పొంది జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్నారు. శారీరక దృఢత్వం కోసం, మానసిక వికాసం కోసం క్రీడలు ఆడాలని సూచించారు. ఈ టోర్నమెంట్ లో 13 జిల్లాల నుంచి 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.