వనజీవి రామయ్య మృతి సమాజానికి తీరని లోటని, ఒక ప్రపంచ పర్యావరణ వేత్తను మన దేశం కోల్పోయింది అని రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సీఎం రమేష్ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటిపేరును వనజీవిగా మార్చుకున్న దరిపల్లి రామయ్య జీవితం అందరికీ ఆదర్శమన్నారు. కోటికి పైగా మొక్కలు నాటి రికార్డు సృష్టించారన్నారు.