కసింకోట మండలం, బయ్యవరం గ్రామంలో శనివారం హజరత్ ఆన్సర్ మద్ ని ఔలియా దర్గాలో 73వ ఉరుసు చందనోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముతవల్లి జనాబ్ అబ్దుల్ మాకీమ్, బార్బర్, ఇబ్రహీం, మత పెద్దలు దాడి రత్నాకర్ కి స్వాగతం పలికి శాలువతో సత్కరించారు