పాయకరావుపేట మండలంలోని వెంకటనగరం గ్రామంలో ఆదివారం మహా అన్నసంతర్పణ కార్యక్రమం జరగనుంది. గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ ధనతల్లి అమ్మవారి పండుగ సందర్భంగా రేపు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. భక్తి శ్రద్దలతో గ్రామస్తులంతా ఒక్కటై రేపు చేయబోతున్న ఈ మహా అన్నసంతర్పణ కార్యక్రమంలో అన్ని గ్రామాల భక్తులు పాల్గొని అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించాలని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామపెద్దలు కోరుతున్నారు.