రాజధాని అమరావతికి వ్యతిరేకంగా మహిళలను కించపరిస్తూ జరిగిన డిబేట్ను నిరసిస్తూ మహిళలు మంగళవారం ఆందోళన చేపట్టారు. అనకాపల్లి నెహ్రూ చౌక్ జంక్షన్ వద్ద ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆ ఛానెల్ ను నిషేధించాలని, ఛైర్మన్ భారతి, జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం మానవహారం నిర్వహించి సదరు దినపత్రిక ప్రతులను దహనం చేశారు.