అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనకాపల్లి జిల్లా కన్వీనర్గా గున్న యోగచంద్ర వివేక్ ఎన్నికయ్యారు. ఈ నెల 8 నుంచి 11 వరకు అనంతపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి అభ్యాస వర్గలో ఈ ఎన్నికను ప్రకటించారు. ఈ సందర్భంగా గురువారం మాట్లాడుతూ ప్రపంచ0లోనే అతి పెద్ద విద్యార్థి సంస్థ అయిన ఏబీవీపీలో అనకాపల్లి జిల్లా కన్వీనర్ గా ఎన్నికవడం ముదావహమన్నారు. విద్యార్థులకు క్షేత్రస్థాయిలో మరింత సేవ చేసే అదృష్టం లభించిందన్నారు.