ఇల్లు కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకోవాలని వినతి

77చూసినవారు
ఇల్లు కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకోవాలని వినతి
కురుస్తున్న వర్షాలకు హుకుంపేట మండలంలోని రాప పంచాయతీ పరిధి గొందిరాపలో ఇల్లు కోల్పోయిన కొప్పుల. సింహాచలం కుటుంబాన్ని ఆదుకోవాలని జనసేన మండల పార్టీ అధ్యక్షుడు కోటేశ్వరరావుపడాల్ కోరారు. శనివారం హుకుంపేట తాహాసిల్దార్ కార్యాలయం వద్ద ఆర్ఐ మోహనరావుని కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ. ఇల్లు కోల్పోయిన బాధిత కుటుంబానికి ఎటువంటి పరిహారం దక్కలేదన్నారు. అధికారులు స్పందించి పరిహారం అందేలా చూడాలని కోరారు.