అనంతగిరి మండలంలోని వాలసిలో ఉన్న ఆరోగ్య ఉప కేంద్ర భవనం శిధిలావస్థకు చేరుకొని నిరూపంగా ఉంది. 25 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆరోగ్య ఉప కేంద్ర భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. దీంతో విధులు ఎక్కడ నిర్వహించాలో తెలియక ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని గిరిజనులు మంగళవారం తెలిపారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి నిధులు మంజూరు చేసి నూతన భవనం నిర్మాణం చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు.