ఆదివాసీల ఆరాధ్య దైవం బిర్సాముండా జయంతిని పురస్కరించుకుని అనంతగిరి మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీపీ శెట్టి. నీలవేణి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ. భగవాన్ బిర్సముండా ఆదివాసీల హక్కుల కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని అభినందించారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. తాహాసిల్దార్ మాణిక్యం ఎంపీడీవో కుమార్ తదితరులున్నారు.