అనంతగిరి మండలంలోని జీనబాడు, పినకోట ఆశ్రమ పాఠశాలలను శనివారం అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాసరావు పరిశీలించారు. బేస్ లైన్ అసెస్మెంట్ టెస్ట్ నిర్వహణను తనిఖీ చేసి, విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలల్లో అవసరమైన సౌకర్యాలు, ఎదురయ్యే సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్శనలో హెచ్ఎంలు మల్లేశ్వరి, సోంబాబు తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.