అనంతగిరి: పిడుగుపాటుకు గురై ఆవు దూడ మృతి

52చూసినవారు
అనంతగిరి: పిడుగుపాటుకు గురై ఆవు దూడ మృతి
అనంతగిరి మండలంలోని కాశీపట్నం పంచాయతీ పరిధి సీతంపేట పరిసర ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన భారీవర్షం కురిసింది. దీంతో సీతంపేటకు చెందిన అడారి. సింగప్ప అనే రైతుకు చెందిన ఆవుతోపాటు దూడ సమీపంలోని మేత మేస్తుండగా వాటిపై భారీ పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాయి. వాటి విలువ సుమారు రూ. 40వేలు వరకు ఉంటుందని ప్రభుత్వాధికారులే గుర్తించి పరిహారం ఇప్పించి ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన కంటతడి పెట్టారు.

సంబంధిత పోస్ట్