అనంతగిరి మండలంలో టోకూరు పంచాయతీలోని ములియగుడ నుంచి మువ్వంవలస వరకు తారురోడ్డు నిర్మాణం పూర్తిచేయాలని సిపిఎం ఆధ్వర్యంలో గిరిజనులు నిరసన చేపట్టారు. గురువారం సిపిఎం పార్టీ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా పాల్గొన్న సిపిఎం మండల కార్యదర్శి మోస్య మాట్లాడుతూ. 2018 సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో బీటిరోడ్డు మంజూరయిందన్నారు. నేటికీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయలేదని అధికారులు స్పందించాలన్నారు.