అనంతగిరి మండలంలోని అనంతగిరి, కాశీపట్నం, కొత్తూరు, లక్ష్మీపురం గ్రామ పంచాయతీల పరిధిలోని పాఠశాలల 512 మంది పేద విద్యార్థులకు దాతల సహకారంతో నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్స్, బిస్కెట్స్, సబ్బులు వంటి స్టేషనరీ సరఫరాలను ఉచితంగా పంపిణీ చేశారు. విద్యపై ఆసక్తి పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సంస్థ అధ్యక్షురాలు దీసరి దేముదమ్మ, సభ్యులు పాల్గొన్నారు.