అనంతగిరి మండలంలోని కొత్తవలస బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు అనంతగిరి పీహెచ్సీ వైద్యురాలు లక్ష్మీ ఆధ్వర్యంలో మంగళవారం కంటి అద్దాలు పంపిణీ చేశారు. జెడ్పీటీసీ గంగరాజు పాల్గొని విద్యార్థులకు కంటి అద్దాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ మండలంలో 14 పాఠశాలల్లో రేచీకటితో బాధపడుతున్న విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.