అనంతగిరి మండలంలోని లుంగాపర్తి పంచాయతీ పరిధి కుంభర్తి పరిసర ప్రాంతంలో బుధవారం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి పిడుగు పడి 5 మేకలు మృత్యువాత పడ్డాయి. గ్రామానికి చెందిన జన్ని. సింహాద్రి, సీదేరి. బాలకృష్ణ అనే రైతులకు చెందిన మేకలు అడవికి మేతకు వెళ్లి ఉండగా పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాయి. సుమారు రూ. 70 వేలు విలువచేసే మేకలు మృతి చెందడంతో బాధిత రైతులు కన్నీటి పర్యంతమయ్యారు.