అనంతగిరి మండలంలోని చిలకలగెడ్డలో మంగళవారంతో కిశోరి వికాసం వేసవి శిక్షణ తరగతులు ముగింపు ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ సూపర్వైజర్ శాంతిప్రియ మాట్లాడుతూ. బాల్య వివాహాల వలన కలిగే దుష్ప్రయోజనాలు వాటి నివారణ గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అనంతరం కిశోరి బాలికలకు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు ఆశ కార్యకర్తలున్నారు.