చిలకలగెడ్డ పంచాయితీలో ఆదివారం అఖిల పక్ష సమావేశం సర్పంచ్ కిల్లో మోస్య అధ్యక్షతన నిర్వహించారు. వారు మాట్లాడుతూ 11, 12 తేదీల్లో జరిగే ఏజెన్సీ బంద్ ను జయప్రదం చేయాలని అఖిల పక్ష సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసి గంగరాజు, ఇతర పార్టీ నాయకులు సూర్యనారాయణ, అప్పారావు, లక్ష్మణరావు, అశోక్, తవిటి నాయుడు, సింగులు దేవన్న, రామకృష్ణ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.