అనంతగిరి మండలంలోని లుంగాపర్తిలో గురువారం 3 సంవత్సరాల పిల్లలకు వేద పండితుల మంత్రోచ్ఛారణాల మధ్య సామూహిక అక్షరాభ్యాసం వైభవంగా నిర్వహించారు. అనంతరం 3 సంవత్సరాల పిల్లలకి తల్లిదండ్రులు అంగన్వాడిలో చేర్పించారు. తల్లిదండ్రులు చిన్నారులకు బాల్యం నుంచి మంచి చదువుతోపాటు మన సంస్కృతి సంప్రదాయాలను అలవర్చాలన్నారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ ఝాన్సీలక్ష్మి ఉపాధ్యాయులు ఉమాశ్రీ అంగన్వాడి కార్యకర్తలున్నారు.