అనంతగిరి: అర్ధనగ్నంగా డోలీ మోతతో నిరసన

60చూసినవారు
అనంతగిరి: అర్ధనగ్నంగా డోలీ మోతతో నిరసన
అనంతగిరి మండలం కళ్యాణగుమ్మి గ్రామానికి రహదారి లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ఈ మేరకు వారు బుధవారం అర్ధనగ్నంగా డోలీ మోతతో వినూత్న నిరసన తెలిపారు. తమ గ్రామానికి ఏడాది క్రితం రహదారి మంజూరు చేశారని గుర్తు చేశారు. కానీ, ఫారెస్టు అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో నిర్మాణం జరగలేదన్నారు. ఆసుపత్రికి వెళ్లాలంటే డోలీమోతలు తప్పడం లేదని, తమ కష్టాలను ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన చెందారు.

సంబంధిత పోస్ట్