హోటల్స్, రెస్టారెంట్ లు, దుకాణాల్లో ప్లాస్టిక్ వాడవద్దని అనంతగిరి ఎంపీడీవో కుమార్, ఎమ్మార్వో మాణిక్యం సూచించారు. శుక్రవారం బొర్రా పంచాయితీలో షాపుల వద్దకు వెళ్లి ప్లాస్టిక్ వినియోగిస్తే మొదటి సారి రూ.2500, రెండవ సారి రూ.5000 పెనాల్టీ పడుతుందని, ఆ తరువాత కూడా ప్లాస్టిక్ వాడితే దుకాణాలను సీజ్ చేస్తారని పేర్కొన్నారు. ప్లాస్టిక్ కవర్ల బదులు కాటన్ లేదా జూట్ సంచులు వాడాలన్నారు. 2+ లీటర్ల బాటిల్స్ మాత్రమే విక్రయించాలన్నారు.