ప్రతి ఒక్కరూ యోగాను నిరంతర అభ్యాసంగా మార్చుకోవాలని వైద్యాధికారిణి మంజుభార్గవి అన్నారు. అనంతగిరి మండలంలోని లుంగాపర్తి ఏరియా ఆసుపత్రిలో శనివారం యోగాంధ్రపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ. యోగా సాధనతో మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్యం పదిలంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తలు ఉన్నారు.