అనంతగిరి: గాలికొండ వ్యూ పాయింట్ వద్ద పర్యాటకుల సందడి

73చూసినవారు
అనంతగిరి మండలంలోని గాలికొండ వ్యూ పాయింట్ వద్ద పర్యటకుల సందడి నెలకొంది. ఆదివారం, సోమవారం రెండు రోజులు సెలవు దినాలు రావడంతో దేశంలోని నలుమూలల నుంచి పర్యాటకులు తరలివచ్చి గాలికొండ వ్యూ పాయింట్ వద్ద శనివారం ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఫోటోలకు ఫోజులిస్తూ సందడి చేస్తున్నారు. పర్యటకులతో ఇదే తరహా సందడి అరకులోని గిరిజన మ్యూజియం, బొటానికల్ గార్డెన్, చాపరాయి, జలవిహారి, బొర్రా గుహలు తదితర సందర్శన ప్రాంతాల్లో నెలకొంది.

సంబంధిత పోస్ట్