అనంతగిరి మండలంలోని పినకోట సచివాలయం వద్ద గురువారం ఉదయం రైతులకు వరి విత్తనాలను పంపిణీ చేశారు. సర్పంచ్ మాదల. గణేష్ పాల్గొని రైతులకు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ రైతులకు అవసరమైన వరి విత్తనాలు రైతు భరోసా కేంద్రం వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు. సబ్సిడీపై అందించే విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వాటర్ షెడ్ చైర్మన్ కొండబాబు ఉప చైర్మన్ మత్స్యరాజు దేమునాయుడు తదితరులున్నారు.