ఒకటో తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగిందని టీడీపీ అరకులోయ మండల అధ్యక్షుడు మహాదేవ్ పెదలబుడు పంచాయతీ సర్పంచ్ దాసుబాబు పేర్కొన్నారు. శనివారం అరకులోయలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి రూ. 13 వేలు చొప్పున డబ్బులు జమా చేసిందన్నారు.