అరకులోయ వ్యక్తి బస్కి పంచాయితీ గుగ్గుడు గ్రామంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆద్వర్యంలో డా బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ స్ఫూర్తితో లౌకిక, ప్రజాస్వామ్య రక్షణ, ఆదివాసీ హక్కులు చట్టాల అమలుకు పోరాడాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పొద్దు బాలదేవ్, మాజీ ఎంపీటీసీ దశరథ్ అన్నారు. జీవో నెం. 3 అమలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలని బాలదేవ్ డిమాండ్ చేశారు.