అరకు: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

79చూసినవారు
అరకు: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
అరకులోయ మండలంలోని లోతేరు పంచాయతీ పరిధి డప్పుగుడ, చీడివలస గ్రామాల్లో గన్నేల పిహెచ్సి వైద్యాధికారిణి కమలాకుమారి ఆదేశాల మేరకు మంగళవారం ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఆరోగ్య సహాయకుడు దొన్ను రోగులను పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. కురుస్తున్న వర్షాలతో అన్ని వీధుల్లో పారిశుధ్య పనులు, క్లోరినేషన్ చేపట్టామని తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని గిరిజనుల్ని సూచించారు.

సంబంధిత పోస్ట్