అరకు: క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోకూడదని కౌన్సిలింగ్

52చూసినవారు
అరకు: క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోకూడదని కౌన్సిలింగ్
ఏ ఒక్కరూ క్షణికావేశానికి గురికాకూడదని గన్నెల పీహెచ్సీ డాక్టర్ కనికినాయుడు డప్పుగుడ గ్రామస్తులకు మంగళవారం కౌన్సిలింగ్ ఇచ్చారు. సోమవారం అరకులోయ మండలం, డప్పుగుడ గ్రామంలో జరిగిన హత్య నేపథ్యంలో గన్నెల పీహెచ్సీ వైద్యులు ఆ గ్రామాన్ని సందర్శించి కౌన్సిలింగ్ ఇచ్చారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో జీవితాలు నాశనం అవుతాయని సూచించారు. పాత కక్షలను మనసులో పెట్టుకుని అనాలోచితమైన నిర్ణయాలు తీసుకోకూడదన్నారు.

సంబంధిత పోస్ట్