బాలికలు సామాజిక అంశాలతోపాటు, విద్య, వైద్యం, నైపుణ్యం, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఐసిడిఎస్ పిీఓ లక్ష్మి అన్నారు. మంగళవారం అరకులోయ మండలంలోని బొండంలో కిశోర వికాసంపై బాలికలకు వేసవి శిక్షణ తరగతులు నిర్వహించారు. దశ బాలికలకు వ్యక్తిగత శుభ్రత, రక్తహీనత, పోక్సో చట్టం, లింగ వివక్ష, విద్య నైపుణ్యాల అభివృద్ధి, బాల్య వివాహాలపై ఆమె అవగాహన కల్పించారు. 11-18 సంవత్సరాల బాలికలు ఈ శిక్షణ తరగతులకు పాల్గొనాలని కోరారు.