అరకులోయ మండలంలోని గన్నెల పంచాయతీ పరిధి కొసిగుడ గ్రామంలో ఉన్న చేతి పంపుకు మరమ్మతులు చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. 5 నెలలుగా చేతిపంపు మరమ్మత్తులకు గురవడంతో గిరిజనులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ సమీపంలోని ఊట గెడ్డల నీటిని తెచ్చుకొని తమ అవసరాలకు వినియోగించుకుంటున్నామని పాపోతున్నారు. అధికారులు స్పందించి మరమ్మత్తుకు గురైన చేతిపంపుకు మరమ్మతులు చేపట్టాలని శుక్రవారం కోరారు.