గ్రామాల్లో మలేరియా నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అరకు ఎమ్మెల్యే రేగం. మత్స్యలింగం అన్నారు. మంగళవారం అరకులోయ మండలంలోని రవ్వలగుడలో ప్రారంభించిన మొదటి విడత మలేరియా పిచికారి పనుల్లో ఆయన పాల్గొని పిచికారి చేశారు. ఆయన మాట్లాడుతూ మలేరియా వ్యాధి నివారణకై ఇంటింటికి పిచికారి చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎమ్ఓ సత్యనారాయణ అధికారులు అప్పలస్వామి సూపర్వైజర్ సుజాత హెల్త్ అసిస్టెంట్ చిన్న ఉన్నారు.